Abn logo
Oct 22 2020 @ 00:45AM

ప్రతి రైతునూ ప్రభుత్వం ఆదుకుంటుంది : సబిత

మహేశ్వరం / కందుకూరు : రంగారెడ్డిజిల్లాలో వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు కోల్పోయిన రైతన్నలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని విద్యాశాఖమంత్రి పి.సబితారెడ్డి భరోసా ఇచ్చారు. బుధవారం మహేశ్వరం, కందుకూరు మండలాల్లో వర్షాలకు దెబ్బతిన్న వరి, పత్తి ఇతర కూరగాయల పంటలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రైతులు అధైర్య పడొద్దన్నారు. జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి ప్రతి రైతుకూ సర్కార్‌ న్యాయం చేస్తుందని తెలిపారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో దెబ్బతిన్న పంటలను పరిశీలించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఆ నివేదిక వచ్చాక పరిహారం డబ్బులను మంజూరు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ కప్పాటి పాండురంగారెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మహేశ్వరం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎస్‌.వరలక్ష్మీసురేందర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ జి.శమంత, సహకార సంఘం చైర్మన్‌ డి.చంద్రశేఖర్‌, వైస్‌ చైర్మన్‌ జి.విజయేందర్‌రెడ్డి, డైరెక్టర్లు ప్రకాశ్‌రెడ్డి, ఎస్‌.శేఖర్‌రెడ్డి, పొట్టి ఆనంద్‌, జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి, ఏడీఏ సుజాత, ఎండీవో నర్సింహులు, రఘుమారెడ్డి, సునితఅంద్యానాయక్‌, పాండుయాదవ్‌, కోటేశ్వర్‌రెడ్డి, కూనయాదయ్య పాలొన్నారు.

Advertisement
Advertisement