Abn logo
Sep 17 2021 @ 00:58AM

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల ఏర్పాటు

విద్యార్థులతో మాట్లాడుతున్న కమిషనర్‌

పామూరు, సెప్టెంబరు 16: ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించి విద్యాభివృద్ధికి కృషి చేస్తోందని ప్రభుత్వ పాఠశాలల విద్యా కమిషనర్‌ ఓడరేవు చిన్న వీరభద్రుడు అన్నారు. మండలంలోని ఇనిమెర్ల ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో గురువారం మాట్లాడారు. జగనన్న విద్యాకానుక పథకం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జాయింట్‌ డైరెక్టర్‌ రవీంధ్రనాథ్‌రెడ్డి, సమగ్ర శిక్ష అభియాన్‌ సీఎంవో రాజాల కొండారెడ్డి, ప్రకాశంజిల్లా ఓపెన్‌ స్కూల్‌ కో ఆర్డినేటర్‌ బిజ్జం శ్రీనివాసులరెడ్డి తదితరులు ఉన్నారు.