Abn logo
Jul 10 2020 @ 21:51PM

ఈఎస్ఐ స్కాం : ఏ1 బెయిల్ పిటిషన్‌పై విచారణ

అమరావతి : ఈఎస్ఐ స్కాం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడితో పాటు పలువుర్ని ఈ కేసులో అరెస్ట్ చేయగా... మరికొందర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మరో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు ముందస్తు బెయిల్‌కు అప్లై చేసుకున్నారు. ఇవాళ పితాని మాజీ పర్సనల్ సెక్రెటరీ మురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. మున్ముందు మరింత మంది పెద్దలను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.


కాగా.. ఈ ఈఎస్ఐ స్కాంలో ఏ1గా ఉన్న రమేష్ కుమార్ బెయిల్ పిటిషన్‌కు దాఖలు చేసుకున్నారు. శుక్రవారం నాడు ఈ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. అయితే వచ్చేవారం బెయిల్ పిటిషన్‌పై కోర్టు ఏం చెప్పనుంది..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement
Advertisement
Advertisement