Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈశ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేయించాలి

హాజీపూర్‌, నవంబరు 27: అసంఘటిత కార్మికులందర్ని ఈశ్రమ్‌ పోర్టల్‌ లో నమోదు  చేయించాలని జిల్లా రవాణా శాఖ అధికారి కిష్టయ్య అన్నారు. శనివారం వేంపల్లిలో గల రవాణా శాఖ కార్యాలయంలో బస్‌, ఆటో, క్యాబ్‌, లారీ యూనియన్‌ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లా డుతూ అసంఘటిత కార్మికులందర్ని ఈశ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేయించడం ద్వారా వారికి సామాజిక భద్రతతోపాటు సంక్షేమ పథకాలు అందుతాయ న్నారు. ఇందులో చేరిన వారికి గుర్తింపు కార్డు ఇస్తారని, కార్డు ఉంటేనే ప్రభు త్వం అందించే అన్ని రకాల సంక్షేమ పథకాలు వర్తిస్తాయన్నారు.  ప్రతి కార్మికునికి రూ. 2 లక్షల ప్రమాద భీమా లభిస్తుందన్నారు. 16 నుంచి 59 సంవత్సరాలలోపు వారందరు ఈశ్రమ్‌లో నమోదు చేసుకోవాలన్నారు. కామన్‌ సర్వీసు సెంటర్లు, మీ సేవలో నమోదు చేస్తారని తెలిపారు.  

Advertisement
Advertisement