Abn logo
Jul 15 2020 @ 08:49AM

రిపోర్టు రాకుండానే పాజిటివ్ అంటున్నారు: ‌టీవీ న‌టి ఆవేద‌న

దేశంలో లాక్‌డౌన్ అన్‌లాక్‌కు మారుతున్న త‌రుణంలో వెసులుబాటు చిక్క‌డంతో ప‌లు టీవీ సీరియ‌ళ్ల చిత్రీక‌ర‌ణ ప్రారంభ‌మ‌య్యింది. అయితే ఈ షూటింగ్‌ల కార‌ణంగా కొత్త‌గా క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. హిందీ సీరియ‌ల్ కసౌటీ జిందగి కే నటుడు పార్థ్ సమధాన్ కరోనా బారిన‌ప‌డ్డారు. అప్పటి నుంచి ఈ షోలోని ప్రధాన నటి ఎరికా ఫెర్నాండెజ్ కూడా కరోనా పాజిటివ్‌గా మారార‌నే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిని ఎరికా ఖండించారు. ఈ విష‌యాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేస్తూ, తన కరోనా టెస్ట్ రిపోర్ట్ ఇంకా రాలేద‌ని తెలిపారు. ఇది నెగిటివ్‌గా రావాల‌ని ప్రార్థిస్తున్నాన‌ని అన్నారు. 

Advertisement
Advertisement
Advertisement