Abn logo
Jun 1 2020 @ 21:09PM

రూ. 868 కోట్ల పెన్షన్లు విడుదల చేసిన ఈపీఎఫ్ఓ

న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ పెన్షన్ స్కీంలో భాగంగా రూ.105 కోట్ల ఎరియర్లు సహా రూ.868 కోట్ల పెన్షన్లను విడుదల చేసినట్టు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) సోమవారం తెలిపింది. ఈ ఎరియర్ వల్ల 6,30,000 మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.  ఈపీఎఫ్ఓ 135 ప్రాంతీయ కార్యాలయాల ద్వారా 6.5 మిలియన్ల మందికిపై పింఛన్‌దారులకు సేవలు అందిస్తోంది. కొత్త నిబంధనల కారణంగా 6.30 లక్షల మంది పింఛన్‌దారులు లబ్ధి పొందనున్నారు. కొత్త నిబంధనల వల్ల కేంద్ర ప్రభుత్వ అవుట్‌గో ఏడాదికి దాదాపు రూ.1300 కోట్లు పెరగనుంది.  


Advertisement
Advertisement
Advertisement