Abn logo
Jun 4 2020 @ 04:40AM

డ్రైవర్లకు భరోసా

నేడు రెండో విడత వాహన మిత్ర నగదు పంపిణీ

 జిల్లాలో 13,766 లబ్ధిదారులు


ఒంగోలు (క్రైం), జూన్‌ 3 : జిల్లాలోని ఆటో, క్యా బ్‌, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు వాహన మిత్ర పథకం ద్వారా రెండో విడత నగదు పంపిణీ గురువారం జరగనుంది. ఒంగోలులోని  స్పందన భవన్‌లో ఏర్పా టు చేసిన జిల్లా స్థాయి కార్యక్రమానికి మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌ హాజరుకానున్నారు. ఈ పథకం ద్వారా 13,766 మం దికి లబ్ధి చేకూరనుంది. గత ఏడాది తొలి విడత 11654 మందికి నగదు అందజేయగా, ఈ సారి నూతనంగా 2149 మందిని ఎంపిక చేశారు.  ఒక్కో డ్రైవర్‌ బ్యాంకు ఖాతాలో రూ.10వేల నగదు  జమ కానుందని రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌ డాక్టర్‌ బి. శ్రీకృష్ణవేణి తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement