పార్ల్: దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీ్‌సలో పర్యాటక ఇంగ్లండ్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. డికాక్ (30), జార్జ్ లిండే (29) రాణించడంతో తొలుత దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లకు 146 పరుగులు సాధించింది. ఛేదనలో మలాన్ (55) అర్ధ సెంచరీతో మెరవడంతో ఇంగ్లండ్ 19.5 ఓవర్లలో 147/6 స్కోరు చేసి నెగ్గింది. కెప్టెన్ మోర్గాన్ 26 (నాటౌట్), జోస్ బట్లర్ 22 రన్స్ చేశారు.