Abn logo
Sep 25 2021 @ 10:04AM

Noida: బీటెక్ విద్యార్థి బొమ్మ తుపాకీ చూపించి ఏం చేశాడంటే...

ఐదుగురు నిందితుల అరెస్ట్ 

నోయిడా : బొమ్మ తుపాకీ చూపించి బెదిరించి కారును ఎత్తుకెళ్లిన బీటెక్ విద్యార్థి సహా ఐదుగురిని నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని  నోయిడా నగరంలోని సెక్టార్ 58లో బంపర్ దెబ్బతిందని, చెక్ చేసుకోమని కారు ఆపారు. ఇంజినీరింగ్ విద్యార్థి పిస్టల్ ఆకారంలో ఉన్న బొమ్మ తుపాకీ చూపించి బెదిరించి కారును దోచుకున్నాడు.ఈ దోపిడీలో ఐదుగురు వ్యక్తులు పాల్గొన్నారని,వారు తుపాకీ ఆకారంలో ఉన్న గ్యాస్ లైటర్‌ను ఉపయోగించారని పోలీసులు చెప్పారు.


సీసీటీవీ ఫుటేజీని చూసి నిందితులను గుర్తించామని నోయిడా డీసీపీ చెప్పారు. కారును దోచుకున్న నిందితుల్లో వికాస్, కార్తీక్, యువరాజ్ వినాయక్, అభిషేక్ శర్మ, శివమ్ వాల్మీకిలను పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు నిందితులు మరో కారు దొంగిలించడానికి ప్రయత్నించి, విఫలమయ్యారని డీసీపీ చెప్పారు.నిందితుల్లో ఒకరు రెండో సంవత్సరం బిటెక్ విద్యార్థి. మరొకరు మాజీ జస్టిడియల్ ఉద్యోగి అని డీసీపీ వివరించారు.

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...