Abn logo
Feb 28 2021 @ 19:14PM

నాలుగో టెస్టు పిచ్ ఇదే.. మళ్లీ నోరు పారేసుకున్న మైఖెల్ వాన్

లండన్: అహ్మదాబాద్ టెస్టులో భారత్ గెలుపును ఇంగ్లండ్ మాజీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానంగా ఆ దేశ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ ఏ మాత్రం సహించలేకపోతున్నాడు. టెస్టు మ్యాచ్ ముగిసి మూడు రోజులు గడుస్తున్నా మైఖెల్ వాన్ మాత్రం టీమిండియా, అహ్మదాబాద్ పిచ్‌లను నిందిస్తునే ఉన్నాడు. బీసీసీఐ, ఐసీసీలపై కూడా  నోరు పారేసుకుంటున్నాడు. తాజాగా తన ట్విటర్‌లో అలాంటి ట్వీట్ ఒకటి మళ్లీ చేశాడు. ఓ రైతు పొలం దున్నుతున్న పిచ్‌ ఫోటోను షేర్ చేసిన వాన్.. ‘నాలుగో టెస్టుకు పిచ్‌ను తయారు చేసే పనులు జరుగుతున్నాయి. క్యూరేటర్ మంచి పిచ్ తయారు చేస్తున్నాడం’టూ ఆ ఆ ట్వీట్‌లో రాసుకొచ్చాడు.


Advertisement
Advertisement
Advertisement