Abn logo
Oct 20 2020 @ 02:16AM

ఎస్సీ కార్పొరేషన్ల రిజిస్ట్రేషన్లను ప్రారంభించండి

వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ 

కర్నూలు, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్సీ కార్పొరేషన్లను మూడు భాగాలుగా విభజించి రిజిస్ట్రేషన్లను ప్రారంభించాలని కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. జేసీ సయ్యద్‌ ఖాజా మోహిద్దీన్‌, ఎస్సీ కార్పొరేషన్‌ కార్యనిర్వాహక సంచాలకుడు చంద్రశేఖర్‌తో కలిసి కలెక్టర్‌ సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్‌ను జిల్లా మాల, మాదిగ, రెల్లి, ఇతర కులస్తులతో కలిపి మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయాలని కో-ఆపరేటీవ్‌ సొసైటీ, ఎస్సీ కార్పొరేషన్‌ కార్యనిర్వాహక అధికారులను ఆదేశించారు.


Advertisement
Advertisement