Abn logo
Jul 11 2020 @ 05:16AM

ఉపాధి కూలీ నిజాయితీ

రూ. 1.28 లక్షలు అప్పగించిన రాజు


కొత్తపల్లి, జూలై 10: ఓ ఉపాధి కూలీ నిజాయితీ చాటుకున్నాడు. తనకు దొరికిన నగదును కొత్తపల్లి పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని లింగాపురం గ్రామానికి చెందిన ఓంకారేశ్వర ఆచారి అనే వ్యక్తి ఆత్మకూరులోని ఆంధ్రాబ్యాంకులో రూ. 1.28 లక్షలు నగదును తన ఖాతాలో జమ చేసుకునేందుకు ఓ ఆటోలో వెళ్లారు. కొత్తపల్లిలో ఆటో ఆపడంతో వెనుక సీటులో కూర్చున్న ఓంకారేశ్వరాచారి ముందు సీటుకు వెళ్లారు.


ఈ క్రమంలో నగదు జారి పడిపోయింది. అదే సమయంలో కొత్తపల్లికి చెందిన రాజు అనే ఉపాధి కూలీకి ఆ డబ్బులు దొరికాయి. దీంతో నిజాయితీగా కొత్తపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఆ నగదును అప్పగించాడు. అప్పటికే నగదును పోగొట్టుకున్న ఓంకారేశ్వర్‌ కొత్తపల్లి పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. పోలీసులు విచారించి ఆ నగదు ఓంకారేశ్వర్‌కు అప్పజెప్పారు. నిజాయితీ చాటుకున్న రాజును ఎస్‌ఐ నవీన్‌బాబు, పోలీసు సిబ్బంది అభినందించారు.

Advertisement
Advertisement
Advertisement