Abn logo
Jun 4 2020 @ 04:55AM

పెన్నాలో ఉపాధి పనుల పరిశీలన

కమలాపురం, జూన్‌ 3: మండల పరిధిలోని పెన్నానదిలో చేస్తున్న ఉపాధి పనులపై ‘నిధులు ఏట్లో పోస్తున్నారు’ అన్న కథనం ఆంధ్రజ్యోతిలో వెలువడడంతో డ్వామా పీడీ యదుభూషణ్‌రెడ్డి ఆదేశాల మేరకు కమలాపురం ఏపీడీ శివప్రసాద్‌ పెన్నానదిలో జరిగిన పనులను పరిశీలించారు. ఆంధ్రజ్యోతిలో రాసింది అక్షరాలా నిజమని, ప్రతిపాదనలు రూపొందించిన విధంగా కాకుండా ఇక్కడ వేరే విధంగా పనులు చేశారన్నారు. తమ సిబ్బంది చేసింది తప్పేనని, అందువల్లనే ఫీల్డ్‌ అసిస్టెంటు, టెక్నికల్‌ అసిస్టెంటు, ఈసీ, ఏపీవోలకు మెమోలు ఇచ్చామన్నారు. వారు సంజాయిషీ ఇచ్చిన అనంతరం క్షేత్ర స్థాయిలో మరోమారు పరిశీలించి ఎంతమంది కూలీలు అక్కడ పనిచేశారు, వారికి ఎంత పేమెంటుకు ప్రతిపాదించారనేది రిపోర్టు తయారు చేసి శాఖాపరమైన చర్యలకు పీడీకి ఇవ్వడం జరుగుతుందన్నారు. 

Advertisement
Advertisement
Advertisement