Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

కర్నూలు(ఎడ్యుకేషన్‌), డిసెంబరు 8: ఉపాధ్యాయ, ఉద్యోగుల, కార్మిక పెన్షనర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీజేఏసీ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయరాజు డిమాండ్‌ చేశారు. ఏపీజేఏసీ, ఏపీజేఏసీ-అమరావతి ఐక్యవేదిక ఇచ్చిన కార్యచరణ పిలుపు మేరకు రెండో రోజు బుధవారం కర్నూలు పట్టణంలోని కింగ్‌ మార్కెట్‌ ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో బోధన, బోధనేతర సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. 


మద్దికెర: మండలంలోని పెరవలి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు  భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ నాయకులు నాగరాజు, నారాయణస్వామి, ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ, వీరోజిరావు, నాగరాజు, శ్రీనివాసులు, సరిత తదితరులు పాల్గొన్నారు. 


తుగ్గలి: తుగ్గలి తహసీల్దార్‌ కార్యాలయం, జిల్లాపరిషత్‌ హైస్కూల్‌ వద్ద నిరసన తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్‌ నిజాంఉద్దీన్‌, ఆర్‌ఐ సుధాకర్‌రెడ్డి, వీఆర్వోలు రమణారెడ్డి, కాశీరంగస్వామి, కృష్ణారెడ్డి, సాగర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement