Advertisement
Advertisement
Abn logo
Advertisement

పీఆర్సీ జాప్యంపై ఉద్యోగుల నిరసన

గోస్పాడు, డిసెంబరు 8: ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీ, ఇతర హామీలపై ఆలస్యం చేస్తుండడంతో రాష్ట్ర ఉద్యోగ సం ఘాల పిలుపు మేరకు బుధవారం తహసీల్దార్‌ మంజుల, సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలన్ని నెరవేరుస్తామని చెప్పి, రెండున్నర సంవత్సరాలైన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆర్‌ఐలు రామచంద్రరావు, రామేశ్వరమ్మ పాల్గొన్నారు. 


చాగలమర్రి: 11వ పీఆర్సీ విడుదల చేయాలని చాగలమర్రి  ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు గంగాధర్‌, నారాయణరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పీఆర్సీ మంజూరులో తీవ్ర జాప్యం చేస్తోందని, అన్ని రకాల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. సీహెచ్‌వో రెడ్డెమ్మ, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ వెంకటమ్మ, సూపర్‌వైజర్లు రామలింగారెడ్డి, సీతారాములు, ప్రమీలమ్మ, ఫార్మసిస్టు నరసింహరావు, ల్యాబ్‌ టెక్నిషియన్‌ అనిల్‌కుమార్‌, బీమా మిత్ర గురుప్రతాప్‌ పాల్గొన్నారు. 


దొర్నిపాడు: ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి కిషోర్‌ అన్నారు. బుధవారం ఏపీ జేఏసీ పిలుపు మేరకు దొర్నిపాడు గ్రామంలో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రకటించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామకృష్ణ, రమణయ్య, గిరిబాబు, తాహేర్‌బాష, రజాక్‌బాషా, రామకృష్ణారెడ్డి, రాజేష్‌, ప్రసాదు పాల్గొన్నారు.Advertisement
Advertisement