Abn logo
Sep 28 2020 @ 04:38AM

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: బొప్పరాజు

ఒంగోలు(కలెక్టరేట్‌), సెప్టెంబరు 27: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌(ఏపీఆర్‌ఎ్‌సఏ) రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని రెవెన్యూభవన్‌లో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదు డీఏలతోపాటు పీఆర్‌సీ కూడా పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ వైద్యారోగ్య, రెవెన్యూ, పోలీస్‌, పంచాయతీ తదితర శాఖల ఉద్యోగులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. అటువంటివారికి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement
Advertisement