Abn logo
Jul 11 2020 @ 21:12PM

కరోనా ఎఫెక్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్!

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్.. కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా ఏర్పడ్డ నష్టాలను పూడ్చుకోవడానికి ఇప్పటికే 10శాతం ఉద్యోగులను తొలగించిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్.. మరో 9000వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధం అయింది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధ్యక్షుడు టిమ్ క్లార్క్ స్పష్టం చేశారు. కాగా.. కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో విజృంభించడంతో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది మంది ప్రజలు.. ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. ఇదిలా ఉంటే.. యూఏఈలో ఇప్పటి వరకు 54వేల మంది కరోనా బారినపడ్డారు. ఇందులో దాదాపు 44వేల మంది కరోనాను జయించి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 330 మంది ప్రాణాలు కోల్పోయారు. 


Advertisement
Advertisement
Advertisement