షాబాద్: విద్యుత్ షాక్తో చందన్వెల్లిలో గేదె మృతిచెందింది. రైతు అంతయ్య తెలిపిన వివరాల మేరకు.. వెల్స్పన్ కంపెనీ ఆవరణలో గేదెలు మేపాడు. విద్యుత్ స్తంభాల మధ్య మట్టి కుప్పలు పోయడంతో వైర్లు భూమికి తాకాయి. గేదె కుప్పపైకి వెళ్లగానే వైర్లు తగిలి షాక్కొట్టి మృతిచెందిందన్నాడు.