Abn logo
Jun 4 2020 @ 03:02AM

‘మలప్పురం’ ఏనుగు వధపై ఆగ్రహావేశాలు

  • ఖండించిన ప్రముఖులు.. సమగ్ర నివేదిక కోరిన కేంద్రం


కొచ్చి/ముంబై, జూన్‌ 3: కేరళలోని మలప్పురం జిల్లాలో బాణసంచా కూ ర్చిన పైనాపిల్‌ను ఆహారంగా అందించి.. గర్భంతో ఉన్న ఏనుగును వధిం చిన ఘటనపై బుధవారం దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఘటనకు బాధ్యులపైన వారిపై చర్యలు తీసుకోవాలని సినీతారలు సహా ప లువురు ప్రముఖులు డిమాండ్‌ చేశారు. జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించే వారిని కఠినంగా శిక్షించేలా చట్టాలు తీసుకురావాలని సోషల్‌మీడి యా వేదికగా నెటిజన్లు కోరారు. ‘పక్కా ప్రణాళిక ప్రకారమే ఏనుగు ప్రా ణాలు తీశారు. ఆ మూగజీవికి న్యాయం జరగాలి’ అని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటా పేర్కొన్నారు. కేరళ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని మాజీ కేంద్రమంత్రి మేనకాగాంధీ తప్పుపట్టారు. ఈ దురాగతంపై కేరళ అటవీ శాఖను ఫిర్యాదులతో ముంచెత్తాలని ప్రజలను కోరిన ఆమె, అందుకు సంబంధించిన ఫోన్‌ నంబర్లు, మెయిల్‌ ఐడీని ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ ఘటనపై ‘ఛేంజ్‌.ఓఆర్‌జీ’ వెబ్‌సైట్‌ దాఖలు చేసిన ఆన్‌లైన్‌ పి టిషన్‌కు మద్దతు పలికిన సినీతారల జాబితాలో అనుష్క శర్మ, శ్రద్ధా కపూ ర్‌, రణ్‌దీప్‌ హుడా తదితరులు ఉన్నారు. ఈనేపథ్యంలో స్పందించిన కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌.. మలప్పురం ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేరళ సర్కారుకు సూచించింది. కేంద్రం జోక్యంతో కదిలిన కేరళ అధికార యం త్రాంగం ఏనుగు మృతికి కారకులుగా భావిస్తున్న గుర్తు తెలియని వ్యక్తుల పై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసింది. కాగా, ఇదే రీతిలో ఏప్రిల్‌లో కొల్లం జిల్లాలో మరో ఏనుగు మృతిచెందినట్లు అధికారవర్గాలు గుర్తించాయి. దాని పోస్టు మార్టం నివేదిక అందితే కారణాలు వెలుగుచూసే అవకాశాలు ఉన్నాయి. 


Advertisement
Advertisement
Advertisement