Abn logo
Apr 4 2021 @ 13:57PM

ఎన్నికల వ్యయ పరిశీలకులతో ఈసీ భేటీ

న్యూఢిల్లీ : శాసన సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఎన్నికల వ్యయ పరిశీలకులతో ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ రాష్ట్రాలకు చెందిన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లోని ప్రత్యేక వ్యయ పరిశీలకులు, అధికారులు ఆదివారం జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారాన్ని ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ ఈ వివరాలను తెలిపింది. 


30 స్థానాలున్న పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత శాసన సభకు ఎన్నికలు ఈ నెల 6న జరుగుతాయి. అదే రోజున 234 స్థానాలున్న తమిళనాడు, 140 స్థానాలున్న కేరళ శాసన సభలకు కూడా ఎన్నికలు జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మే 2న జరుగుతుంది.