Abn logo
Oct 20 2020 @ 02:17AM

సమస్యల పరిష్కారానికి కృషి: ఎస్పీ

Kaakateeya

కర్నూలు, అక్టోబరు 19: జిల్లాలోని పోలీసుల సమస్యలను పరిశీలించి, పరిష్కరిస్తామని ఎస్పీ ఫక్కీరప్ప అన్నారు.  సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయం కమాండ్‌ కంట్రోల్‌ నుంచి జూమ్‌ కాన్ఫరెన్స్‌లో గ్రీవెన్స్‌ డే నిర్వహించారు. ఆళ్లగడ్డ, నంద్యాల, కర్నూలు, డోన్‌, ఆత్మకూరు, ఆదోని, సబ్‌ డివిజన్ల సిబ్బందితో మాట్లాడారు.

పదోన్నతులు, రిక్వెస్ట్‌ బదిలీలు, క్వాటర్స్‌ సమస్యలు, జీపీఎఫ్‌, ఎపీజిల్‌ఐ బాండ్‌లు, అనారోగ్య సమస్యలపై అటాచ్‌మెంట్‌లు తదితర సమస్యలను సిబ్బంది ఎస్పీ దృష్టికి తెచ్చారు. స్పందించిన ఎస్పీ పరిశీలించి, పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏఎస్పీ అడ్మిన్‌ మధుసూదన్‌రావు, ఏఆర్‌ ఏఎస్పీ రాధాకృష్ణ, డీపీవో ఏవో సురే్‌షబాబు, ఎస్పీ పీఏ నాగరాజు, కమ్యూనికేషన్‌ సీఐ రమేష్‌, ఆర్‌ఐలు సురేంద్రారెడ్డి, సుధాకర్‌, వీఎస్‌ రమణ ఉన్నారు.


Advertisement
Advertisement