Abn logo
Mar 6 2021 @ 00:56AM

గిరిజన గృహాల్లో వెలుగులు నింపేందుకు కృషి

అడిషనల్‌ ఎస్పీ వైవీఎస్‌ సుదీంద్ర

తిర్యాణి, మార్చి 5: గిరిజనగృహాల్లో వెలు గులు నింపేందుకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్లు అడిషనల్‌ ఎస్పీ వైవీఎస్‌ సుదీంద్ర అన్నారు. శుక్రవారం తిర్యాణి మండ లంలోని కుర్సిగూడ, పంగిడి మాదర, కోలాం గూడ, నాయకపుగూడ గ్రామాల్లో కస్తూరి ఫౌండేషన్‌ చైర్మన్‌ చరణ్‌ సహకారంతో 50 గృహాలకు సోలాస్‌ దీపాల సెట్‌ అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో విద్యుత్‌లేక ప్రజలు అంధకారంలో మగ్గుతున్నట్లు తమ దృష్టికి తీసుకురావడంతో కస్తూరి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సోలార్‌ దీపాలను పంపిణీ చేశామన్నారు. ఈ సందర్భంగా ఎస్సై రామారావుతో పాటు కస్తూరి ఫౌండేషన్‌ చైర్మన్‌ చరణ్‌ను అభినందించారు. డీఎస్పీ అచ్చేశ్వర్‌రావు, సీఐ సతీష్‌, ట్రస్మా కార్యదర్శి పద్మ చరణ్‌, లయన్స్‌ క్లబ్‌ శరత్‌, సర్పంచ్‌ కుర్సింగె చిత్రు, గూడాల పటేళ్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement