Advertisement
Advertisement
Abn logo
Advertisement

కాలుష్య నివారణకు కృషి చేయాలి : డ్వామా పీడీ

కనిగిరి, డిసెంబరు 2: ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి కాలుష్య నివారణకు కృషి చేయాలని నియోజకవర్గ ప్రత్యేక అధికారి, డ్వామా పీడీ శీనారెడ్డి పేర్కొన్నారు. జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులతో గురువారం జరిగిన నియోజకవర్గస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.  భూపాల్‌లో 1984లో జరిగిన గ్యాస్‌ లీకేజీ దుర్గటనలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. నాటి దుర్ఘటన కాలుష్య నివారణను దేశానికి గుర్తు చేసిందన్నారు. నాటి నుంచి కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మానవ తప్పిదాలతో కాలుష్యం పెరిగి గాలి, నీరు, భూమి కలుషితమౌతోందన్నారు. అడవులు నరికివేత, విచ్చలవిడిగా ప్లాసిక్‌ వినియోగం కాలుష్యానికి ప్రధాన కారణమన్నారు. ఇకనైనా ప్రజలు ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేధించి ప్రతిఒక్కరూ మొక్కలు నాటి కాలుష్య నివారణ దిశగా అడుగులు వేయాలని కోరారు. మొక్కలు నరకడం వల్లే పర్యావరణం సమతుల్యత దెబ్బతింటోందన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌, తహసీల్దార్‌ పుల్లారావు, ఎంపీడీవో మల్లికార్జునరావు, ఎంఈవో ప్రసాద్‌రావు, మెప్మా మేనేజర్‌ రఘు, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ మాధవి, ఏఎ్‌సఐ ముల్లా అహ్మద్‌, గుడ్‌హెల్ప్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement