Abn logo
Jul 11 2020 @ 05:24AM

మత్స్యకళాశాల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే కాకాణి

ముత్తుకూరు, జూలై10: రాష్ట్రంలోనే ముత్తుకూరులో ఉన్న ఏకైక మత్స్యకళాశాల అభివృద్ధికి కృషి చేస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు. ముత్తుకూరు మత్స్యకళాశాలలో రూ. 6.30 కోట్లతో నిర్మించిన అదనపు భవనాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు.


ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మత్స్య రంగ పట్టభద్రులను తయారుచేస్తూ, మత్స్య పరిశ్రమ అభివృద్ధికి కళాశాల ఎంతో తోడ్పడుతుందన్నారు. కళాశాలలో సీట్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంద న్నారు. అనంతరం మండల కార్యాలయాల సమీపంలో చేపల మార్కెట్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు శ్రీహరి, మత్స్యకళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ హరిబాబు, వైసీసీ నాయకులు మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి, నెల్లూరు శివప్రసాద్‌, కాకుటూరు లక్ష్మణరెడ్డి, మాచిరెడ్డి శేఖర్‌రెడ్డి, మత్స్యకార నాయకులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement