Advertisement
Advertisement
Abn logo
Advertisement

జిల్లా విద్యార్థులకు జాతీయ స్థాయి ఇన్‌స్పైర్‌ అవార్డులు ప్రదానం

గుంటూరు(విద్య), డిసెంబరు4: జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు జాతీయస్థాయిలో ఇన్‌స్పైర్‌ అవార్డులు అందుకున్నారు. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్‌ పీఎస్‌ గోయల్‌ వీరికి అవార్డులు అందజేశారు. అత్తోట జడ్పీస్కూల్‌ విద్యార్థిని పొగడదండ కీర్తి తయారు చేసిన వెండర్స్‌ ఫెండ్లీ సోలార్‌కూల్‌కార్డ్‌కు, దుర్గిమండలం ఓబులేసునిపల్లె జడ్పీస్కూల్‌ విద్యార్థి విష్ణువర్ధన్‌రెడ్డి తయరుచేసిన ఎయిర్‌ బ్యాగ్‌ ప్రొటక్షన్‌ ఫర్‌ బైకర్స్‌కు జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయి. కార్యక్రమంలో గైడ్‌ టీచర్లు రాయపాటి శివనాగేశ్వరరావు, ఆలేటి రమేష్‌ తదితరులు వ్యవహరించారు. విద్యార్థులను ఆర్జేడీ వీఎస్‌ సుబ్బారావు, డీఈవో ఆర్‌ఎస్‌ గంగాభవాని, డిప్యూటీ డీఈవో కె.నారాయణరావు, జిల్లా సైన్స్‌ కోర్డినేటర్‌ ఏఏ మధుకుమార్‌ తదితరులు అభినందించారు.

Advertisement
Advertisement