Abn logo
Oct 5 2021 @ 17:10PM

చిరాగ్‌, పరస్‌ గ్రూపులకు గుర్తులు కేటాయించిన ఈసీ

పాట్నా: లోక్‌ జన్‌శక్తి పార్టీ రెండు గ్రూపులుగా విడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఉన్న గుర్తును రద్దు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. తాజాగా రెండు కూటములకు రెండు ఎన్నికల గుర్తులను కేటాయించింది. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని కూటమికి హెలికాప్టర్ గుర్తును కేటాయించగా, ఎంపీ పశుపతి కుమార్ పరస్ నేతృత్వంలోని కూటమికి షేవింగ్ మిషన్ గుర్తును కేటాయించింది. బిహార్‌లోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈసీ మంగళవారం ఈ గుర్తులు కేటాయించింది. ప్రస్తుతం చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని కూటమికి లోక్‌ జన్‌శక్తి పార్టీ (రాం విలాస్) అని పరస్ నేతృత్వంలోని పార్టీకి రాష్ట్రీయ లోక్ జన్‌శక్తి పార్టీ అని మార్పులు చేశారు. ఎల్‌జేపీకి ఉన్న ‘బంగ్లా’ గుర్తును రద్దు చేసిన రెండు రోజులకే ఇరు కూటములకు గుర్తులు కేటాయించడం గమనార్హం.

జాతీయంమరిన్ని...