Abn logo
Sep 28 2021 @ 11:22AM

3 పార్లమెంటరీ, 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు

న్యూఢిల్లీ: ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం మంగళవారంనాడు ప్రకటించింది. 3 పార్లమెంటరీ నియోజకవర్గాలు, 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్టోబర్ 30న ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా అండ్ నగర్ హవేలి అండ్ డామన్ అండ్ డయ్యూతో పాటు మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లోని మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలు, వివిధ రాష్ట్రాలకు చెందిన 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ ఉప ఎన్నికలు జరుగనున్నాయి..

పార్లమెంటరీ నియోజకవర్గాలు

కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా అండ్ నగర్ హేవేలి అమండ్ డామన్ అండ్ డయ్యూలోని దాద్రా అండ్ నగర్ హవేలీలోనూ, మధ్యప్రదేశ్‌లోని 28-ఖాండ్వా, హిమాచల్ ప్రదేశ్‌లోని 2-మండి పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గాలు ఇవే...

ఉప ఎన్నికలు జరుగనున్న వివిధ రాష్ట్రాల్లోని 30 అసెంబ్లీ నియోజవర్గాల వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ (124- బద్వేల్- ఎస్‌సీ), అసోం (28-గోస్సాయిగావ్), అసోం (41-భవానీపూర్), అసోం (58-తముల్‌పూర్), అసోం (101-మరైనీ), అసోం (107-థోవ్రా), బీహార్ (78-కుషేశ్వర్ ఆస్తాన్-ఎస్‌సీ), బీహార్ (164-తారాపూర్), హర్యానా (46-ఎల్లెనాబాద్), హిమాచల్ ప్రదేశ్ (08-ఫతేపూర్), హిమాచల్ ప్రదేస్ (50-అర్కీ), హిమాచల్ ప్రదేశ్ (65-జుబ్బల్-కొథాయ్), కర్ణాటక (33-సిండ్గి), కర్ణాటక(82-హాంగల్), మధ్యప్రదేశ్ (45-పృధ్వీపూర్), మధ్యప్రదేశ్ (62-రాయ్‌గావ్-ఎస్‌సీ), మధ్యప్రదేశ్ (192-జోబట్-ఎస్‌టీ), మహారాష్ట్ర (90-డెగ్లూర్-ఎస్‌సీ), మేఘాలయ (13-మవీన్కెనెంగ్-ఎస్‌టీ), మేఘాలయ (24-మాఫ్లాంగ్-ఎస్‌టీ), మేఘాలయ (47-రాజబల), మిజోరామ్(4-తుయిరియల్-ఎస్‌టీ), నాగాలాండ్ (58-షామ్‌టోర్-చెస్సోర్-ఎస్‌టీ), రాజస్థఆన్ (155-వల్లభ్ నగర్), రాజస్థాన్ (157-ధరియావాడ్-ఎస్‌టీ), తెలంగాణ (31-హుజారాబాద్), పశ్చిమబెంగాల్ (7-దిన్‌హట), పశ్చిమబెంగాల్ (86-శాంతిపూర్), పశ్చిమబెంగాల్ (109-ఖర్దహా), పశ్చిమబెంగాల్ (127-గోసబ-ఎస్‌సీ).

కాగా, ఉప ఎన్నికలకు అక్టోబర్ 1న ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ వెలువడుతుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8. అక్టోబర్ 11న నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు 13వ తేదీ చివరిరోజు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 2న కౌంటింగ్ ఉంటుంది. నవంబర్ 5వ తేదీ లోపు మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుంది

ఇవి కూడా చదవండిImage Caption

జాతీయంమరిన్ని...