Abn logo
Sep 28 2020 @ 05:24AM

ఐఎస్‌ఎల్‌లో ఈస్ట్‌ బెంగాల్‌

కోల్‌కతా: ఈ సీజన్‌ ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)లో కోల్‌కతాకు చెందిన ప్రముఖ క్లబ్‌ జట్టు ఈస్ట్‌ బెంగాల్‌ ఆడనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. 1920లో ఈ క్లబ్‌ జట్టును ఏర్పాటు చేశారు. గోవాలో ఈ ఏడాది నవంబరు 21న ఐఎ్‌సఎల్‌ ప్రారంభం కానుంది. దీంతో ఈసారి ఈస్ట్‌ బెంగాల్‌తో సహా మొత్తం 11 జట్లు టైటిల్‌ కోసం పోటీపడనున్నాయి. ఇక మూడు వేదికల్లో జరిగే మ్యాచ్‌లకు కొవిడ్‌-19 నేపథ్యంలో ప్రేక్షకులను అనుమతించడం లేదు.

Advertisement
Advertisement
Advertisement