న్యూయార్కు (అమెరికా): అమెరికా దేశంలోని నేవడ మినా పట్టణానికి దక్షిణాన 24 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. అమెరికాలో సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.2 గా నమోదైందని యూఎస్ జియాలాజికల్ సర్వే వెల్లడించింది. మంగళవారం రాత్రి అమెరికాలో 10.2 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని అమెరికా భూగర్భ శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనలు చెందారు. ఈ భూకంపం వల్ల ఆస్తినష్టం, ప్రాణనష్టంపై సమాచారం అందలేదు.