Abn logo
Apr 3 2020 @ 16:16PM

దసరాకు హౌస్‌ఫుల్?

కరోనా మహమ్మారి వల్ల ఇతర రంగాలతోపాటు సినీ పరిశ్రమ కూడా భారీగా నష్టపోయింది. సినిమాలకు వేసవి మంచి సీజన్. ఈ వేసవిలో కూడా చాలా సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అయితే వేసవి ఆశలపై కరోనా నీళ్లు జల్లింది. సినిమాలను విడుదల చేసుకునే అవకాశం లేకుండా చేసింది. ఈ నెల 14న లాక్‌డౌన్ ఎత్తేసినా సినిమాలు విడుదలయ్యే పరిస్థితులు లేవు. 


లాక్‌డౌన్ ఎత్తేసిన వెంటనే జనాలు థియేటర్లకు వస్తారని చెప్పలేం. అలాగే భారత్‌లో లాక్‌డౌన్ లేనప్పటికీ ఓవర్సీస్ పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడేలా లేవు. కాబట్టి ఈ ఏడాది వేసవి సీజన్ లేనట్టే. ఇక, మిగిలింది దసరా సీజన్. పవన్ `వకీల్‌సాబ్`, అఖిల్ `మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్`, నితిన్ సినిమా, వెంకీ `నారప్ప`, రామ్ `రెడ్`, శర్వానంద్ `శ్రీకారం`, నాగచైతన్య `లవ్‌స్టోరీ` సినిమాలు దసరాను టార్గెట్‌గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. 

Advertisement
Advertisement
Advertisement