Abn logo
Oct 25 2020 @ 00:50AM

వైభవంగా కుంకుమ పూజలు

దండేపల్లి/కోటపల్లి, అక్టోబరు 24: హనుమాన్‌ మందిరం వద్ద ప్రతిష్టిం చిన దుర్గామాత మండపం వద్ద శనివారం సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. కోటపల్లి మండలం కొండంపేటలో ప్రత్యేక పూజలు చేశారు. చెన్నూరు రూరల్‌ సీఐ నాగరాజు, తహసీల్దార్‌ రామచంద్రయ్యలు  పాల్గొన్నారు. కుంకుమార్చనలు, ప్రత్యేక భజనలు చేశారు. ఎంపీటీసీ చంద్ర గిరి శంకరయ్య, మనోహర్‌ పాల్గొన్నారు. 


తాండూర్‌(బెల్లంపల్లి): తాండూర్‌ శివాలయంలో దుర్గామాతకు 101 ప్రసా దాలతో నైవేద్యం పెట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో దుర్గామాత ను దర్శించుకున్నారు. పూ జారి శ్రీనివాస్‌శర్మ తీర్ధప్రసాదాలను అందజేశారు. 


ఏసీసీ: విశ్వనాథ ఆలయంలో 108 తా మరపువ్వులు, 9 కల శాలతో పూజలు నిర్వహించారు. బలిదానం చేసినట్లు దుర్గాదేవి పూజా కమిటీ స భ్యుడు ధర్మేందర్‌ తె లిపారు. శ్రవణ్‌కుమా ర్‌, శిరీష,  కమిటీ స భ్యులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement