Abn logo
Aug 7 2020 @ 03:25AM

కరోనాతో దుర్గగుడి వేదపండితుడు మృతి

విజయవాడ, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో పనిచేస్తున్న ఓ వేదపండితుడు కరోనా బారినపడి మరణించారు. మూడురోజుల క్రితం వైరస్‌ సోకిన ఆయన చికిత్స పొందుతూనే గురువారం ఉదయం కన్నుమూశారు. ఆయన భార్య కూడా ప్రస్తుతం ఐసీయూలో ఉన్నట్టు చెబుతున్నారు. కాగా, దేవస్థానం ఈవో కొద్దిరోజులుగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. పరీక్షల్లో ఆయనకు కరోనా నిర్ధారణ అయింది. కాగా, ఈవో సహా ఇప్పటి వరకు దుర్గగుడిలో 15 మందికి వైరస్‌ సోకింది. 

Advertisement
Advertisement
Advertisement