Abn logo
Oct 25 2020 @ 16:53PM

దుర్గామల్లేశ్వరస్వామి ఊరేగింపు ప్రారంభం

Kaakateeya

విజయవాడ: దుర్గామల్లేశ్వరస్వామి ఊరేగింపు ప్రారంభమైంది. ఊరేగింపుగా తెప్పోత్సవానికి ఉత్సవమూర్తులను అధికారులు తీసుకువస్తున్నారు. నదీ విహారం లేకపోవడంతో హంస వాహనంలో ఉత్సవమూర్తులకు తెప్పలోనే వేద పండితులు పూజలు నిర్వహించనున్నారు. 25న శ్రీ రాజరాజేశ్వరిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అదే రోజు సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల తెప్పోత్సవం నిర్వహించడం ఆనావాయితీగా వస్తోంది. దీంతో దసరా ఉత్సవాలు ముగుస్తాయి.


దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు రోజున నిర్వహించే తెప్పోత్సవ సేవకు అధికారులు అభ్యంతరం తెలిపారు. కృష్ణానదికి వరద పోటెత్తుతున్నందున గంగా సమేత దుర్గామల్లేశ్వరుల ఉత్సవమూర్తులను హంస వాహనంపై ముమ్మారు నదీ విహారం చేయించే ప్రక్రియను రద్దు చేశారు. దుర్గాఘాట్‌ వద్ద నదిలోనే హంస వాహనాన్ని ఉంచి పూజలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement