Advertisement
Advertisement
Abn logo
Advertisement

Duplicate documentsతో వ్యాపారికి బురిడీ

హైదరాబాద్‌ సిటీ: నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఓ వ్యక్తిని మోసం చేసి రూ. 1.10కోట్లు కాజేసిన నిందితుడిని సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా, శంషాబాద్‌, తోండుపల్లి గ్రామానికి చెందిన పెదిరిపాటి శేఖర్‌గౌడ్‌ (38) రియల్‌ వ్యాపారం చేయడంతో పాటు స్థానికంగా ఉన్న నెట్‌ వర్క్‌ చానెల్స్‌కు మేనేజింగ్‌ పార్టనర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆ చానెల్‌లో అతని భార్య సరిత కూడా భాగస్వామిగా ఉందని సీసీఎస్‌ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రియల్‌ వ్యాపారంలో ఉన్న శేఖర్‌ స్థానికంగా వివాదాల్లో ఉన్న భూములను డీల్‌ చేస్తుంటాడని పోలీసులు గుర్తించారు. ఇదే క్రమంలో మరో వ్యక్తితో కలిసి నిందితుడైన శేఖర్‌ ఈజీమనీ కోసం ప్లాన్‌ చేసుకున్నాడు. మూసాపేటలో ఉన్న ఓ ప్రైవేట్‌ కంపెనీకి చెందిన 1500 గజాల ఓపెన్‌ ప్లాట్‌ను విక్రయించడానికి నకిలీ పత్రాలు సృష్టించారు.

బంజారాహిల్స్‌కు చెందిన ఓ వ్యాపారితో కలిసి విక్రయిస్తున్నట్లు నకిలీ పత్రాలు, నకిలీ అగ్రిమెంట్‌ చూపి ఆ ప్లాటు ధర రూ. 11.25 కోట్లకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌గా రూ. 1.10 కోట్లు తీసుకున్నారు. ఆ తర్వాత మోసపోయానని గ్రహించిన వ్యాపారి సీసీఎ్‌సలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన డిటెక్టివ్‌విభాగం పోలీసులు ప్రధాన నిందితుడైన శేఖర్‌గౌడ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement