Abn logo
Sep 25 2020 @ 04:53AM

ముంపు బాధితులను ఆదుకోవాలి


ఊర్కొండ, సెప్టెంబరు 24: మండలంలోని మాదారం చెరువులో పంట పొలాలు మునిగి తీవ్ర నష్టం వాటిల్లుతుందని రాచాలపల్లి ముంపు బాధిత రైతులు గురువారం తహసీల్దార్‌ రామచంద్రయ్యకు వినతిపత్రం సమర్పించారు. మాదారం చెరువును కేఎల్‌ఐ కాలువ ద్వారా వస్తున్న నీటిని సామర్థ్యం కంటే ఎక్కువగా నింపుకుంటున్నారని, దాని వల్ల రాచాలపల్లి గ్రామానికి చెందిన రైతుల పంట పొలాలు మునిగి నష్టం వాటిల్లుతుందని వారు వినతిపత్రంలో సమర్పించారు. ఈ కార్యక్రమంలో అరుణ్‌, ఆంజనేయులు, బాలరాజు, దాసు, దావిద్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
Advertisement