Abn logo
Sep 22 2020 @ 00:40AM

నీళ్లున్నా నిష్ఫలం

Kaakateeya

ఊకచెట్టు వాగులో చిక్కుకున్న తాగునీటి బోర్లు

అవి పని చేయకపోవడంతో పలు గ్రామాల్లో ఎద్దడి


చిన్నచింతకుంట, సెప్టెంబరు 21: కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని ఆయా గ్రామాల్లో వాగులు, వంకలు, చెరువులు నిండి పొంగి పొర్లుతున్నాయి. తాగు నీటికోసం కల్పతరువుగా ఉన్న ఊకచెట్టు వాగు కోయిల్‌సాగర్‌ నీటితో నిండుగా పారుతుంది. వాగు శివారు ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీల తాగునీటి మోటార్లు వాగులో మునిగిపోయాయి.


కరెంటు వైర్లు దెబ్బతిన్నాయి. తదితర కారణాల వల్ల బోర్లు పని చేయక తాగునీటి సరఫరా నిలిచింది. దాంతో నీటి కోసం ప్రజలు కిలో మీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బోర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. మండల కేంద్రంలో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అయితే ఆ నీళ్లు చాలడం లేదని, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని వార్డుల్లోనూ నీటిని సరఫరా చేసేందుకు మరిన్ని ట్యాంకర్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement