Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైభవోపేతంగా కార్తీక దీపారాధన మహోత్సవం

 ద్రాక్షారామ, నవంబరు 30: ద్రాక్షారామలో 58వ కార్తీక దీపారాధన మహోత్సవం మంగళవారం వైభవోపేతంగా జరిగింది. ఉదయం 6 గంటలకు మైలవరపు శ్రీమన్నాయణ శర్మ ఆధ్వర్యంలో ప్రసన్నాంజనేయ స్వామికి వేదమంత్రాలతో లక్ష తులసి పూజ జరిపారు. స్వామివారిని పంచామృతాలతో అభిషేకించారు. మధ్యాహ్నం ప్రసన్నాంజనేయస్వామిని పుష్పాలంకృతమైన ఉష్ట్ర వాహనంపై ఉంచి మేళతాళాలు, మంగళవాయిద్యాలతో నగరోత్సవం జరిపారు. దీనిని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ తనయుడు సూర్యప్రకాష్‌ ప్రారంభించారు. సాయంత్రం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు-సూర్యకుమారి దంపతులు జ్యోతిప్రజ్వలన చేసి కార్తీక దీపారాధనను ప్రారంభించారు. అఖండ దీపాన్ని వెలిగించారు. అంతకు ముందు ప్రసన్నాంజనేయస్వామికి పూజలు జరిపారు. సూర్య నృత్యనికేతన్‌ కళాకారుల కూచిపూడి నృత్య ప్రదర్శన అలరించింది. రాత్రి 10 గంటలకు ఆంజనేయ ఫైర్‌ వర్క్సు పెద్దిరెడ్డి సూరిబాబు అల్లుడు దవులూరి శ్రీను బాణసంచా కాల్పులు వీక్షకులను మైమరిపించాయి. రాత్రి 12 గంటలకు రామాంజనేయ యుద్ధం వార్‌ సీను, చింతామణి నాటకాన్ని నాటకప్రియులు ఆసక్తిగా తిలకించారు. ద్రాక్షారామ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 
 


Advertisement
Advertisement