Advertisement
Advertisement
Abn logo
Advertisement

అనాథ చిన్నారులను ఆదుకున్న డాక్టర్ ఆనంద్, ఆశా కీర్తి

హైదరాబాద్: అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా అనాథ ఆశ్రమంలో చిన్నారులను బంజారా మహిళా ఎన్‌జీవో ఛైర్మన్, డాక్టర్ ఆనంద్, ఆశా కీర్తి ఆదుకున్నారు. హైదరాబాద్‌లోని బోరబండ ప్రాంతంలో ఉన్న అనాథ ఆశ్రమంలో చిన్నారులకు నోట్ బుక్స్, పెన్నులను అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆనంద్ మాట్లాడుతూ పేద మరియు అనాథ పిల్లలను ఆదుకోవడం కోసం ప్రాజెక్ట్ కలం, కాగితం, పుస్తకం అనే కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యను మించిన ఆయుధం ఇంకొకటి లేదని, నవ సమాజ నిర్మాణం విద్య ద్వారానే సాధ్యమని ఆయన తెలిపారు. ఇందుకు సహకరిస్తున్న దాతలకు డాక్టర్ ఆనంద్ ధన్య వాదాలు తెలియజేశారు.


Advertisement
Advertisement