Abn logo
Oct 10 2020 @ 03:02AM

డబుల్‌ ఇళ్ల కేటాయింపులో అన్యాయం

Kaakateeya

మేడ్చల్‌ అర్బన్‌: డబుల్‌ ఇళ్ల కేటాయింపులో పేదలకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపిస్తూ కీసర మండలం చీర్యాల గ్రామస్థులు శుక్రవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. సర్పంచ్‌, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీలు చెప్పిన వారికి ఇళ్లు అలాట్‌ చేసి అర్హులను మరిచారని ఆరోపించారు. కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని, అలాట్‌మెంట్‌ను నిలిపివేసి మళ్లీ రీసర్వే చేసి అర్హులకు అందజేయాలని కుమార్‌, సుజాత, మంజుల, గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి పేదలకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. 

Advertisement
Advertisement