Abn logo
Jul 12 2020 @ 05:10AM

నిరుపేదలందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు

ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌

వీరన్నపేటలో నిర్మించిన 650 ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక


మహబూబ్‌నగర్‌ టౌన్‌, జూలై 11 : ఇళ్లు లేని నిరుపేదలందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు మంజూరు చేస్తామని ఎక్త్సెజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌లోని జడ్పీ సమావేశ మందిరంలో శనివారం వీరన్నపేటలో నిర్మించిన 660 ఇళ్లకు సంబంధించి డ్రా తీసి, లబ్ధిదారులను ఎంపిక చేశారు. అనంతరం మంత్రి మట్లాడుతూ వీరన్నపేటలో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల లబ్ధిదారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.


రిజర్వేషన్‌ ప్రాతిపదికన అన్ని వర్గాల వారికి ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఇళ్లు లభించిన వారు ఇక్కడే నివాసం ఉండాలని, త్వరలో పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి అన్నారు. కలెక్టర్‌ వెంకట్రావు మాట్లాడుతూ వీరన్నపేటలో 660 ఇళ్లు ఉన్నాయని, ఇందులో ఎస్సీలకు 85, ఎస్టీలకు 40, మైనార్టీలకు 79, ఓపన్‌ క్యాటగిరిలో 456 ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో యాదయ్య, ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్‌ పార్థసారథి పాల్గొన్నారు. కాగా, డ్రాలో మొదటి లబ్ధిదారుగా యాదమ్మ ఎంపికైంది.

Advertisement
Advertisement