Oct 13 2021 @ 14:13PM

బీచ్‌లో బికినీలో స్నానం చేస్తున్న ఫొటోలను ఇన్‌స్టా‌గ్రామ్‌లో పెట్టిన మోడల్.. ఆ ఒక్కటీ అడక్కు.. అంటూ ఫ్యాన్స్‌తో ఫన్..!

బాలీవుడ్ ప్రముఖ కథానాయిక అనన్యా పాండే సోదరిగానే కాదు.. మోడల్‌గా, యూట్యూబర్‌గా, ఇంటర్నెట్ సెన్షేషన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది అలన్నా పాండే. తన హాట్ ఫొటోలను అలన్నా తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా అలన్నా పోస్ట్ చేసిన బికినీ ఫొటోలు ఆమె ఫాలోవర్లను మరింత ఖుషీ చేశాయి.  


తాజాగా అరేబియా సముద్రం ఒడ్డున వైట్ బికినీ ధరించి శంఖం నుంచి నీటిని శరీరంపై ఒంపుకుంటూ తీసుకున్న ఫొటోను అలన్నా అభిమానులతో పంచుకుంది. `అరేబియా సముద్రం ఒడ్డున నిల్చుని ఓ పెద్ద శంఖం నుంచి నీటిని డ్రమటిక్‌గా ఎందుకు నాపై పోసుకుంటున్నానని అడగకండి. ఐవర్ అలా చేయమన్నాడు` అంటూ కామెంట్ చేసింది. అలన్నా పాండే ప్రస్తుతం ఐవర్ మెకరీ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. సహజీవనం చేస్తోంది. ఈ ఫొటోను తన ప్రియుడే తీశాడని అలన్నా తెలిపింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 




Bollywoodమరిన్ని...