Abn logo
May 22 2020 @ 03:57AM

దాతలు పేదలను ఆదుకోవాలి

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి


మేడ్చల్‌ : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు పడుతోన్న నిరుపేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకురావాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం పూడూరులో సర్పంచ్‌ బాబూయాదవ్‌ ఆధ్వర్యంలో ఉచితంగా బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.


కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంట్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఎంపీపీ పద్మజగన్‌రెడ్డి, జడ్పీటీసీ శైలజావిజయానందరెడ్డి, ఎంపీటీసీ నీరుడు రఘు, మాజీ సర్పంచ్‌లు నర్సింహారెడ్డి, తహసీల్దార్‌ సురేందర్‌, ఎండీఓ పద్మావతి పాల్గొన్నారు. 

Advertisement
Advertisement