Abn logo
Jan 18 2021 @ 00:33AM

నిధుల సేకరణ

శ్రీశైలంలో విరాళాల సేకరణ కార్యక్రమంలో ఈవో కేఎస్‌ రామరావు, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త వంశీకృష్ణ, బీజేపీ నాయకులు

శ్రీశైలం, జనవరి 17: రామ జన్మభూమి తీర్థ క్షేత్రం నిర్మాణం కోసం శ్రీశైలంలో ఆదివారం విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారం భించారు. దేవస్థానం ఈవో కేఎస్‌ రామరావును కలిసి విరాళాన్ని తీసుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త వంశీకృష్ణ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణానికి చెందిన పలువురు రామమందిర నిర్మాణానికి విరాళం ఇచ్చారు. హోండా షోరూమ్‌ డీలర్‌ శ్రీధర్‌ రూ.25వేలు, శ్రీశైలం ట్రస్టుబోర్డు చైర్మన్‌ వంగాల శివరామిరెడ్డి రూ.14వేలు, మారం చంద్రశేఖర్‌ రూ.14వేలు, మేనుకొండ వెంకటశివుడు రూ.10116, అలాగే పట్టణానికి చెందిన కొండేటి శ్రీరామనాయుడు, రాసంశెట్టి శివప్రసాద్‌, సద్దల నిషాంత్‌, నర్సప్ప, చెన్నకేశవరెడ్డి, తెలుగు గోవిందులు రూ.5వేల చొప్పున నిధి సమర్పించారు. వెంకటాపురం గ్రామానికి చెందిన కుందూరు మహేశ్వరరెడ్డి 11116, బోసాని రామచంద్రారెడ్డి 5116, కుందూరు లింగారెడ్డి రూ.5116లతో పాటు వడ్లరామాపురం గ్రామానికి చెందిన కేశవరెడ్డి రూ.5వేలు, బాపనంతాపురం గ్రామానికి చెందిన రామాంజనేయులు రూ.3వేల చొప్పున రామమందిర నిర్మాణానికి నిధి సమర్పణ చేసినట్లు కార్యక్రమ నిర్వాహకులు పేర్కొన్నారు. 


వెలుగోడు పట్టణానికి చెందిన ఎ.రాజేశ్వరమ్మ అనే వృద్ధురాలు అయోధ్య రామమందిర నిర్మాణానికై తన దాతృత్వాన్ని చాటుకుంది. అయోధ్య రామమందిర నిర్మాణ విషయం తెలియగానే 10రోజుల క్రితం శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర సంస్థకు రూ.లక్ష నిధిని బ్యాంకు ద్వారా నిధి సమర్పణ చేశారు. ఆదివారం రామమందిర నిధి సమర్పణ అభియాన్‌ ద్వారా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా తమ ఇంటి వద్దకు వెళ్లిన రామభక్తులకు కాదనకుండా మరోమారు రూ.15వేలను రామమందిర నిర్మాణానికి సమర్పించారు. తమ ఇంటి వద్దకు వస్తారో లేదో తెలియక ముందుగానే రూ.లక్ష రామమందిర నిర్మాణానికి బ్యాంకు అకౌంట్‌లో వేశానని ఆమెత ఎలిపారు. శ్రీరామ సేవకులు కృష్ణార్జునరెడ్డి, పార్థసారథిరెడ్డి, నాగేశ్వరరావు, రాజశేఖరరెడ్డి, పురుషోత్తంగౌడ్‌ తదితరులు ఉన్నారు. 


నంద్యాల (కల్చరల్‌): అయోధ్య రామమందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావానే ఉద్దేశంతో ఇంటింటా తిరిగి నిధులు సేకరించారు. ఇందులో భాగంగా నంద్యాలకు చెందిన బచ్చు తిరుపాలయ్య కుమారులు చక్రవర్తి, శ్రీకాంత్‌, శ్రీహరి కలిపి రూ.2,00,464 రూపాయలు సమర్పించారు. శ్రీరామ సేవకులు చిలుకూరి శ్రీనివాస్‌, డాక్టర్‌ ఉదయశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.





Advertisement
Advertisement
Advertisement