Abn logo
May 21 2020 @ 07:52AM

వైరస్‌ సోకకుండా ఆ మందు ‘ఓ రక్షణ రేఖ’: ట్రంప్‌

వాషింగ్టన్‌,మే 20: కరోనా సోకకుండా తాను రోజూ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఔషధాన్ని తీసుకోవడాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మళ్లీ సమర్థించుకున్నారు. వైరస్‌ సోకకుండా ఈ మందు ‘ఓ రక్షణ రేఖ’గా పనిచేస్తుందన్నారు. దీని గురించి భయం వద్దని, మరికొంత కాలం తాను ఈ ఔషధాన్ని తీసుకుంటానని వెల్లడించారు. ఇటలీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌లో ఈ ఔషధం మెరుగైన ఫలితాలు చూపిన అధ్యయనాలు రుజువు చేస్తున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా వైద్యులు దీన్ని సమర్థిస్తున్నారని చెప్పారు. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ మాత్రం తాను హైడ్రాక్సీక్లోరోక్విన్‌ తీసుకోవడం లేదన్నారు. 


Advertisement
Advertisement
Advertisement