Abn logo
Aug 6 2020 @ 23:02PM

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. నవంబర్ 3 నాటికే వ్యాక్సిన్!

వాషింగ్టన్: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో ఈ వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు.. కరోనా వ్యాక్సిన్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కరోనా టీకాపై కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం రోజు ఓ రేడియో ప్రోగ్రామ్‌లో మాట్లాడిన ఆయన.. నవంబర్ 3 నాటికి అమెరికా.. కరోనా టీకాను కలిగి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. వ్యాక్సిన్‌కు సంబంధించిన సమాచారాన్ని అమెరికా నుంచి చైనా దొంగిలించినట్లు మీరు నమ్ముతున్నారా? అని కార్యక్రమ నిర్వాహకులు ట్రంప్‌ను ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఆయన.. ‘నేను కచ్చితంగా చెప్పలేను కానీ అది సాధ్యమే’ అంటూ బదులిచ్చారు. కాగా.. అమెరికాలో ఒకవైపు అధ్యక్ష పదవికి ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. మరోవైపు కరోనా కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఇదిలా ఉంటే.. అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య అర కోటికి చేరువలో ఉంది. మహమ్మారి కారణంగా 1.61లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 


Advertisement
Advertisement
Advertisement