Abn logo
May 20 2020 @ 16:50PM

మరో దేశంపై ట్రావెల్ బ్యాన్ విధించేందుకు సిద్దమైన అమెరికా

వాషింగ్టన్: బ్రెజిల్‌పై అమెరికా ప్రభుత్వం ట్రావెల్ బ్యాన్ విధించేందుకు సిద్దమైంది. ఈ అంశంపై తాము ఆలోచిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం తెలిపారు. ‘బ్రెజిల్ దేశస్థులు ఇక్కడకు వచ్చి అమెరికన్లకు వైరస్ అంటించడం నాకు ఇష్టం లేదు. బ్రెజిల్ దేశస్థులు అనారోగ్యానికి గురవడం కూడా నాకు ఇష్టం లేదు’ అని ట్రంప్ అన్నారు. బ్రెజిల్ కరోనాతో పోరాడుతోందని.. బ్రెజిల్‌కు తాము వెంటిలేటర్లను కూడా ఇస్తున్నట్టు ఈ సందర్భంగా ట్రంప్ చెప్పారు. కాగా.. అమెరికా, బ్రెజిల్ దేశాలు అత్యధిక కరోనా కేసుల జాబితాలో మొదటి, నాలుగో స్థానాల్లో ఉన్నాయి. అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు 15,71,131 కేసులు నమోదవగా.. బ్రెజిల్‌లో 2,71,885 కేసులు నమోదయ్యాయి. ఇక అమెరికాలో కరోనా బారిన పడి 93,558 మంది మరణించాగా.. బ్రెజిల్‌లో 17,983 మంది మృత్యువాతపడ్డారు. 

Advertisement
Advertisement
Advertisement