Abn logo
Aug 14 2020 @ 07:39AM

హెచ్‌1బీ వీసా నిషేధంలో సడలింపులు..!

హెచ్‌1బీ, ఎల్‌1, జే1 వీసాదారులకు ఊరట

వాషింగ్టన్‌, ఆగస్టు 13: నాన్‌ ఇమిగ్రెంట్‌ వీసాల విషయంలో హెచ్‌1బీ, ఎల్‌1, జే1లో కొన్ని కేటగిరీల వీసాదారులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌  ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారు. నిషేధంలో స్వల్ప సడలింపులిచ్చారు. జూన్‌ 22న వీసాలపై నిషేధం అమల్లోకి రాక మునుపు పనిచేసిన సంస్థల్లో వీసాదారులు తిరిగి చేరడానికి అనుమతిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. హెచ్‌1బీ వీసాదారులతో పాటు వారిపై ఆధారపడిన భాగస్వాములు, పిల్లలు కూడా వెంట రావొచ్చని తెలి పింది. అమెరికాలో ఉపాధి పొందు తున్న వారు మళ్లీ ఆ సంస్థల్లో చేరేందుకు హెచ్‌1బీ, ఎల్‌1 వీసాలు జారీ చేయవచ్చని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. హెచ్‌1బీ వీసాలు కలిగిన సాంకేతిక నిపుణులు, మేనేజర్లకు కూడా అనుమతి ఇచ్చింది. 

Advertisement
Advertisement
Advertisement