Abn logo
Sep 21 2021 @ 23:24PM

దేవునల్తాడ తీరంలో డాల్ఫిన్‌

డాల్ఫిన్‌

వజ్రపుకొత్తూరు: దేవునల్తాడ సముద్ర తీరానికి 1000 కిలోల డాల్ఫిన్‌ చేప మంగళవారం కొట్టుకువచ్చింది. ఇవి సముద్రం లోపల మరబోట్లతో చేపలవేటకు వెళ్లిన మత్స్య కారులకు మాత్రమే కనిపిస్తాయి. డాల్ఫిన్‌  తీరానికి కొట్టుకు రావడంతో దానిని చూసేందుకు పెద్దసంఖ్యలో మత్స్యకారులు తరలి వచ్చారు. మరబోట్లకు తగిలి ఈ చేప మృత్యువాత పడి ఉంటుందని వారు చెబుతున్నారు.