Abn logo
May 21 2020 @ 19:07PM

అమెరికాలో కష్టాలని ఇక్కడకు వస్తే.. ఇక్కడ కూడా..

చండీఘడ్: విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను కేంద్రం తీసుకొస్తున్న విషయం తెలిసిందే. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు విమాన ఖర్చు, ఇక్కడకు వచ్చిన తరువాత క్వారంటైన్ ఖర్చును కూడా భరించాల్సి వస్తోంది. ఇటీవల అమెరికా నుంచి భారత్‌కు వచ్చిన రిటైర్డ్ డాక్టర్ ప్యారా లాల్ గర్గ్, ఆయన భార్య క్వారంటైన్‌లో అనేక కష్టాలు పడ్డారు. క్వారంటైన్‌లో వసతులు లేకపోవడంతో ప్యారా లాల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. క్వారంటైన్‌లో ఐదు రోజుల తరువాత దీన్ని మరింత సాగదీయడం ఇష్టం లేక ప్యారాలాల్ తన పిటిషన్‌ను వెనక్కు తీసుకున్నారు. కాగా.. ప్యారా లాల్ తన పిటిషన్‌లో అనేక విషయాలను వెల్లడించారు. తాను, తన భార్య మార్చి 11న అమెరికా వెళ్లామని.. మార్చి 24న భారత్‌కు రావాలని అనుకుంటే లాక్‌డౌన్ కారణంగా రాలేకపోయామన్నారు. 50 రోజుల పాటు అమెరికాలోనే చిక్కుకున్నామని.. మెడికల్ ఇన్సూరెన్స్ గడువు కూడా తీరడంతో అధిక ఖర్చుతో మందులు కొనుక్కోవలసి వచ్చిందన్నారు. గుండె సమస్య, మోకాళ్ల నొప్పులతో బాధపడే తాను మందులు, ఇతర ఖర్చులు భరించలేకపోయానని.. ఆర్థికంగా తన మీద భారం పడిందని వివరించారు. ఈ కారణంగా తాను మానసిక ఒత్తిడికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో 1360 డాలర్లు(రూ. లక్ష 2 వేలు) పెట్టి భారత్‌కు టికెట్ కొనుక్కుని వచ్చామన్నారు. మే 11న తమకు భారత్ వెళ్లేందుకు క్లియరెన్స్ వచ్చిందని.. అప్పటివరకు 2724 డాలర్లు(రూ. 2 లక్షల ఐదు వేలు) తమకు ఖర్చు అయినట్టు వివరించారు. శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి మే 15న తాము న్యూఢిల్లీకి వచ్చామని.. అక్కడి నుంచి తమను చండీఘడ్‌లోని హోటల్ షియాలిక్ వ్యూకు తీసుకెళ్లినట్టు తెలిపారు. అయితే హోటల్‌లో కనీసం లిఫ్ట్ కూడా వాడనివ్వలేదని.. సరైన వసతులు కూడా లేక అమెరికాలో కంటే ఎక్కువ బాధలు పడ్డామని అన్నారు. కాగా.. ప్యారాలాల్, ఆయన భార్య ప్రస్తుతం పాటియాలా క్వారంటైన్‌‌కు మారినట్టు తెలుస్తోంది.

Advertisement
Advertisement
Advertisement