Advertisement
Advertisement
Abn logo
Advertisement

భర్త డాక్టర్.. భార్య బ్యూటీపార్లర్‌కు యజమాని.. రెండు చేతులా సంపాదన.. కానీ మూఢనమ్మకంతో ఆమె చేసిన ఒక్క మిస్టేక్‌తో..

కొందరు దారినపోయే సమస్యలన్నీ ఇంట్లోకి తెస్తుంటారు. మనకెందుకులే అనుకుని వదిలేయకుండా.. అనవసరంగా కలగజేసుకుని ఆఖరికి సమస్యల వలయంలో చిక్కుకుంటూ ఉంటారు. ఇంకొకరి విషయాల్లో కలగజేసుకుంటే చాలా వరకు మంచి జరిగినా.. కొన్నిసార్లు మాత్రం కథ అడ్డం తిరుగుతుంది. తీరా జరగాల్సిన నష్టం జరిగాక.. ఈ తత్వం బోధపడినా ప్రయోజనం ఉండదు. బీహార్‌లో ఓ మహిళ జీవితంలో ఇలాగే జరిగింది. వారికి ఆర్థికపరంగా ఎలాంటి ఇబ్బందులూ లేదు. పైకా భార్యాభర్తలు రెండు చేతులా సంపాదిస్తున్నారు. కానీ భార్య మాత్రం ఓ యువకుడి సమస్యల్లో అసవరంగా తలదూర్చింది. మూఢనమ్మకంతో చేసిన చిన్న మిస్టేక్‌తో చివరికి.. ఆమె జీవితం ఏమైందంటే..

బీహార్‌లోని పాట్నాకు చెందిన ఓ వ్యక్తి వృత్తిరీత్యా వైద్యుడు. ఈయనకు మంచి పేరు ఉండడంతో ఆస్పత్రికి రోగులు క్యూ కడుతుంటారు. దీంతో ఆదాయం కూడా బాగానే వస్తోంది. అంతేకాకుండా ఈయన భార్య రిమ్‌ఝిమ్(45).. ఓ బ్యూటీఫార్లర్ నడుపుతోంది. ఈమె కూడా బాగానే సంపాదిస్తోంది. భార్యాభర్తలిద్దరూ బాగా సంపాదిస్తుండడంతో ఆర్థికపరంగా వారికి ఎలాంటి ఇబ్బందులూ లేవు. అయితే భార్యకు మాత్రం మూఢనమ్మకాలంటే బాగా ఆసక్తి ఉండేది. ఇలా సాగిపోతున్న వారి జీవితంలో అనుకోని ఘటన జరిగింది. ఇటీవల ఆమెకు రోహిత్ అనే యువకుడు పరిచయమయ్యాడు. తనకు వ్యాపారంలో నష్టం రావడంతో ఓ రోజు ఇదే విషయాన్ని రిమ్‌ఝిమ్‌కు చెప్పాడు. తాంత్రిక పూజలు చేయిస్తే నష్టాల నుంచి గట్టెక్కుతావని ఆమె సలహా ఇచ్చింది. దీంతో ఆ యువకుడు అలాగే చేశాడు.

ప్రతీకాత్మక చిత్రం

కొన్నాళ్లకు అతడు నష్టాల నుంచి గట్టెక్కాడు. పూజల వల్లే ఇలా జరిగిందని నమ్మాడు. అయితే ఈ క్రమంలో రోహిత్ బావ అకస్మాత్తుగా మృతి చెందాడు. దీంతో బాధలో అతడు మళ్లీ రిమ్‌ఝిమ్‌ను సంప్రదించి.. విషయం తెలియజేశాడు. ఇంకో తాంత్రిక పూజ చేస్తే అంతా సర్దుకుంటుందని ఆమె మళ్లీ ఓ సలహా ఇచ్చింది. అయితే రోహిత్‌కు అనుమానం కలిగింది. ఈ పూజల కారణంగానే తన బావ చనిపోయాడని భావించి.. మళ్లీ పూజలు చేసేందుకు నిరాకరించాడు. అయితే ఆ మహిళ మాత్రం, పూజలు చేయించకుంటే.. చాలా నష్టపోతావంటూ భయపెట్టింది. దీంతో రోహిత్ ఆలోచనలో పడి.. తన స్నేహితులకు ఫోన్ చేసి, విషయమంతా తెలిపాడు.

తన స్నేహితులైన కమల్ సూరజ్, పవన్‌ సలహాతో ఆ మహిళను చంపేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం సుఫారీ గ్యాంగ్‌తో మాట్లాడి రూ.4లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. నవంబర్ 23న ఆమెకు కాల్ చేసి,  నౌబత్‌పూర్ దగ్గరకు రావాలని పిలిచాడు. అతడి మాటలు నమ్మిన ఆ మహిళ అక్కడికి వెళ్లింది. వచ్చీరాగానే దుండగులు ఆమెపై కాల్పులు జరిపారు. దీంతో రిమ్‌జిమ్.. అక్కడికక్కడే మృతి చెందింది. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 24వ తేదీ నౌబత్‌పూర్ సమీపంలోని ఓ ఖాళీ ప్రదేశంలో మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి నగదు, పిస్టల్, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement